హీరో సిద్ధార్థ్ కు రేప్ చేస్తామంటూ బెదిరింపు కాల్స్

హీరో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ట్విట్టర్ సంచలన ఆరోపణలు చేసారు. తనతో పాటు తన కుంటుంబ సంభ్యులకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. అంతే కాకుండా తమిళనాడు బీజేపీ సెల్ తన ఫోన్ నంబర్ ను భయటకు లీక్ చేసిందంటూ సిద్దార్థ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. 24గంటల్లో తనకు దాదాపు 500 లకు పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయని సిద్ధార్థ్ ట్వీట్ లో పేర్కొన్నారు. తనను తన కుంటుంబ సభ్యులను రేప్ చేస్తామని..చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ సిద్దార్థ్ ఆవేదన వ్యక్తం చేసారు. అంతే కాకుండా తనకు వచ్చిన ఫోన్ కాల్స్ అన్నీ రికార్డ్ చేసినట్టు సిద్ధార్థ్ తెలిపారు. వాటిని పోలీసుల మందు పెడతానని తెలిపారు. తనకు బెదిరింపు మెసేజ్ లు వస్తున్న నంబర్ లు బీజేపీ లింకులు ఉన్నవేనని అన్నారు. బీజేపీ జండాలు..గుర్తులు డీపీలు గా ఉన్న నంబర్ ల నుండే బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. అంతే కాకుండా సిద్ధార్థ్ తన ట్వీట్ లో ప్రధాని మోడీ మరియు అమిత్ షాలకు ట్యాగ్ చేశారు. ఇదిలా ఉండగా కరోనాను అదుపు చేయడంలో బీజేపీ విఫలమైందని ఆరోపిస్తు సిద్ధార్థ్ కొన్ని ట్వీట్లను చేసారు. ఈ సందర్బంగా యోగి ఆదిత్య నాథ్ ను విమర్షించడంతో పాటు...ఇంత జరుగుతున్నా సెలబ్రెటీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.