మహా జనానికి మరదలు పిల్ల...సిల్క్ స్మిత వర్ధంతిsilk
2019-09-23 08:20:16

సిల్క్‌స్మిత తెలుగు సినీ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. తన నటన, హావభావాలతో రసిక రాజుల హృదయాలను మెలిపెట్టి వదిలిన స్మిత అసలు విజయ లక్ష్మి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని దెందులూరు మండలం కొవ్వలిలో పుట్టిన ఆమె తన 15వ యేటే సినిమా రంగంపై ఉన్న ప్రేమతో చెన్నై వెళ్ళింది. నిజానికి తొలిసారిగా 1978లో బేడీ అనే ఓ కన్నడ చిత్రంలో కనిపించినప్పటికీ నా దేశం సినిమాతో తెలుగు తెరపై తళుక్కుమంది. అయితే 1979లో ఇలైతేదీ అనే మళయాళ చిత్రంలో నటించగా అదే యేడాది తమిళంలో నటించిన వండిచక్రం అనే సినిమాలో ఆమె పేరు సిల్క్‌ స్మితగా మారింది. 

ఆమె అందులో నటించిన పాత్ర వలెనే ఆమెకు వరుస అవకాశాలు రావడానికి కారణం అయ్యింది. అలా మొదలయిన ఆమె నటనా ప్రస్థానం ఆమె పలు సినిమాల్లో పాత్రలు నటిస్తూ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుంది. తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను, తన మత్తెక్కించే అందాలతో కుర్రకారుని అలరిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ పరిశ్రమలో తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది సిల్క్ స్మిత. ఐటెం సాంగ్స్ అప్పటిదాకా ఒక మూస పద్దతిలో పోతున్న రోజుల్లో బావలు సయ్యా.. మరదలు సయ్యా.. అనే పాటతో ఆ పాటలలో కూడా కొత్త ఒరవడి సృష్టించింది. ఆ పాత ఇప్పటికీ ఎంతో మందికి హాట్ ఫేవరేట్.  ఐటెం గర్ల్ గానే కాక సీతాకోక చిలుక తదితర సినిమాల్లో మంచిపాత్రలే పోషించారు. 

ఆపై నృత్యంలో పేరు తెచ్చుకోవడం, వాంప్‌ పాత్రలు రావడం అలా ఆ పాత్రల్లో ఆమె ఓదిగిపోయారు. అత్యధికంగా తెలుగు సినిమాల్లో నటించినా తమిళం, కన్నడం, మలయాళం హిందీలలో 148 సినిమాల్లో నటించి మెప్పించారు. ఎన్‌టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, చిరంజీవి, బాలకృష్ణతో పాటు యువ నటులతో కొన్ని పాత్రలు పోషించారు. నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న స్మిత సెప్టెంబరు 23, 1996న ఆత్మహత్య చేసుకుని సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వెండితెరకు ఆమె దూరమై రెండు దశాబ్దాలకి ఎక్కువే అయినా సినీ అభిమానులు మాత్రం ఆమెను ఇంకా మరిచిపోలేదు. ప్రతీ సంవత్సరం ఆమె వర్ధంతి రోజున నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. చిత్రనిర్మాణ రంగంలోకి దిగిన ఆమె నష్టాలపాలవడంతో పాటు, ప్రేమ వ్యవహారాలతో ఆమె ఆత్మహత్య చేసుకుందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్‌’ సంచలన విజయం సొంతం చేసుకొంది.  నేడు సిల్క్ స్మిత వర్ధంతి సందర్భంగా ఆమెకు ఇదే మా సినిమా పాలిటిక్స్ నివాళి.

More Related Stories