పెళ్లిపై స్పందించిన సునిత..ఇది పెళ్ళని అనుకోవడం లేదుSinger Sunitha
2020-12-19 16:29:46

టాలీవుడ్ ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునిత రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆమె పెళ్లిపై వార్తలు వస్తున్నప్పటికీ ఆమె కండించారు. కానీ ఇటీవల నిశ్చితార్థం చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనితో సునిత ఎంగేజ్మెంట్ జరిగింది. కాగా వారి ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరవ్ అవుతున్నాయి. కుటుంబ సభ్యుల నడుమ వారి నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా మొదటి సారి  సునిత తన పెళ్లిపై స్పందించింది. "దీనిని పెళ్లి అని నేను భావించడం లేదు. ఎందుకంటే ఒక కుటుంబం మరో కుటుంబానికి దగ్గరవుతోంది. రెండు కుటుంబాలు ఏకమవ్వడం నాకొక డివైన్ లా అనిపించింది ". అంటూ సునీత తన పెళ్లి పై స్పందించింది. ఇక సునిత వివాహం డిసెంబర్ లో జరగనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ తన వివాహం జనవరిలో జరగవచ్చు అని ఆమె పేర్కొంది.

More Related Stories