మళ్లీ తల్లి అవుతున్న సీనియర్ హీరోయిన్..Sneha
2019-10-04 17:50:12

స్నేహ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరస సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. సీనియర్ హీరోలతో పాటు అప్పుడప్పుడూ కుర్ర హీరోలతో కూడా నటించింది స్నేహ. గ్లామర్ కు దూరంగా ఉంటూనే స్టార్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తమిళనాడుకు వెళ్లి అక్కడ కూడా వరస సినిమాలు చేసింది స్నేహ. ఇక తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి అప్పుడప్పుడూ చేస్తుంది. ఇప్పటికే ఈ జంట ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు రెండో సంతానానికి రెడీ అయింది స్నేహ. ఈ మధ్య కాలంలో కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంది స్నేహ. దానికి కారణం ఆమె మళ్ళీ తల్లి కాబోతుండటమే. స్నేహ సీమంతం ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే చెన్నైలో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం. మొత్తానికి మరికొన్నాళ్ల పాటు స్నేహను స్క్రీన్ పై చూడటం కష్టమే. 
 

More Related Stories