రెచ్చిపోయిన స్నేహా ఉల్లాల్.. అందాలే ఆయుధంగా..sneha
2020-05-10 17:04:17

స్నేహా ఉల్లాల్.. ఉల్లాసంగా ఉత్సాహంగా అంటూ తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. అందులో కొన్ని విజయాలు కూడా ఉన్నాయి కానీ ఈమెకు మాత్రం క్రేజ్ రాలేదు.. వచ్చిన గుర్తింపు యూజ్ చేసుకోవడంలో స్నేహ కూడా విఫలమైంది. ఆ భామ‌ను చూస్తుంటే అచ్చంగా ఐశ్వ‌ర్యారాయ్ ను చూస్తున్న‌ట్లుగానే ఉంటుంది. కొన్ని నెల‌లుగా క‌నిపించ‌డం కూడా మానేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో సెగ‌లు రేపుతుంది. ఐష్ అంత అందంగా ఉంటుంది అంటూ ముందు ఈమెను ఆకాశానికి ఎత్తేసారు. కానీ ఇదే ఈమె కెరీర్ కు శాపంగా మారింది. అస‌లు ఐష్ ఉండ‌గా.. న‌కిలితో ప‌నిలేద‌ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు ఈ భామ‌ను పాపం.
ఇప్ప‌టికీ ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు ఈ ముద్గుగుమ్మ‌ను. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహా లాంటి సినిమాలు హిట్టైనా తెలుగులో స్నేహాకు ఎందుక‌నో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దాంతో ఈ మ‌ధ్య ప్రేక్ష‌కుల‌కు క‌నిపించ‌డం కూడా మానేసంది స్నేహా. కేవ‌లం కుటుంబంతో గ‌డ‌పడం.. ఫోటోషూట్ల‌కు ఫోజివ్వ‌డంతోనే కెరీర్ లాగించేస్తుంది స్నేహాఉల్లాల్. ఇందులో భాగంగానే ఈ మ‌ద్యే ఓ హాట్ ఫోటోషూట్ చేసింది. చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో అమ్మ‌డు ఇచ్చిన పోజుల‌కు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. తాజాగా ఎద అందాలను చూపిస్తూ ఊరిస్తుంది స్నేహ. ఇది చూసిన త‌ర్వాత క‌చ్చితంగా అన‌వ‌స‌రంగా అందాల‌ను వేస్ట్ చేస్తున్నామేమో అనే అనుమానం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కూడా వ‌స్తుంది. అంత‌గా గ్లామ‌ర్ షో చేస్తూ రెచ్చ‌గొడుతుంది స్నేహా. మ‌రి చూడాలిక‌.. ఇప్పటికైనా ఈమె అంటూ ఒక‌రున్నార‌ని మ‌న ద‌ర్శ‌కులు గుర్తిస్తారో లేదో..?

 

More Related Stories