బాలయ్య భామ ఏంటి.. బరువు ఇలా తగ్గిపోయింది..sonali
2020-04-06 14:50:33

బాల‌య్య బ్యూటీనా.. బాల‌య్య‌కు చాలా మంది బ్యూటీస్ ఉన్నారు క‌దా అందులో ఎవ‌రు అనుకుంటున్నారా..? ఈ మ‌ధ్య కాలంలో బాల‌కృష్ణ‌కు బాగా క‌నెక్ట్ అయిన హీరోయిన్ సోనాల్ చౌహాన్. ఆ మ‌ధ్య లెజెండ్ లో సెకండ్ హీరోయిన్ గా న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ వెంట‌నే మ‌రోసారి డిక్టేట‌ర్ లోనూ జోడీ క‌ట్టింది సోనాల్. ఈ రెండు సినిమాలతో పాటు మొన్నొచ్చిన రూలర్ సినిమాలోనూ నటించింది. ఈ మూడు సినిమాల్లోనూ ఒకటి మాత్రం కామన్.. అదే బికినీ స్థాయి అందాల ఆరబోత. ప్రతీ సినిమాలోనూ కాదనకుండా సోకులు ఆరబోసింది సోనాల్. అయితే ఏం చేసినా ఎంత చూపించినా తెలుగులో మాత్రం ఈమెకు వర్కవుట్ కావడం లేదు. టాలీవుడ్ లో వెలిగిపోవాల‌ని చూసింది కానీ పాపం ఏం చేస్తాం పాప‌కు టైమ్ ట‌ర్న్ కాలేదు. దాంతో ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న‌ట్లుంది సోనాల్ ప‌రిస్థితి. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో సీరియ‌ల్స్.. వెబ్ సిరీస్ లు చేసుకుంటుంది సోనాల్. ఈ గ్యాప్ లో బ‌రువు త‌గ్గే ప‌నిలో బిజీగా ఉంది. తాజాగా జిమ్ లో క‌ష్ట‌ప‌డుతున్న పోజ్ తో గుండెలు జారిపోయేలా చేస్తుంది ఈ భామ‌. బ్యాక్ సైడ్ నుంచి పోజ్ ఇస్తూ మ‌తులు పూర్తిగా చెడ‌గొడుతుంది ఈ రెక్సోనా సుంద‌రి. ఇంత కొవ్వు క‌రిగించిన త‌ర్వాతైనా ఎవ‌రో ఓ ద‌ర్శ‌కుడు సోనాల్ చౌహాన్ కు ఓ అవ‌కాశం ఇవ్వ‌క‌పోడూ..!

More Related Stories