ఆ పిల్లలను ప్రభుత్వమే చదివించాలి..సోనూసూద్



Sonu Sood
2021-04-30 16:45:50

దేశంలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో పెద్దగా నష్టం జరగలేదు..కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వయసు పై బడిన వాళ్ళే కాక పాతికేళ్లు ఉన్నవాళ్ళు కూడా కరోనా తో మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కరోనా తో తల్లి తండ్రులు చనిపోగా పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. అయితే తాజాగా అలాంటి పిల్లలకు ఫ్రీగా ప్రభుత్వమే చదువు చెప్పించాలని సోనూసూద్ కేంద్ర రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. 

ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన సోనూసూద్ మాట్లాడుతూ..."కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది తమ సొంతవాళ్ళని కోల్పోయారు. అలా కోల్పోయిన వారిలో 10 నుండి 15 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు. కన్న వాళ్ళు మృతి చెందటంతో పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి అలాంటి వాళ్లకు ప్రభుత్వమే చదువు చెప్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా విద్యను అందించి వారిని ఆదుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అయినా డిగ్రీ మెడిసిన్ అయినా చదివించాల్సిందే. అలా అయితేనే వాళ్ళ భవిష్యత్ బాగుతుంది. దానికోసం ఒక నిబంధన తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా" అంటూ సోనూ లైవ్ లో చెప్పుకొచ్చారు.

More Related Stories