తమ బిడ్డకు సోనూ సూద్ పేరు పెట్టుకున్న దంపతులు Sonu Sood
2021-06-24 12:25:01

సోను సూద్ కరోనా కు ముందు ఒక మంచి నటుడిగానే మనకందరికీ పరిచయం కానీ ఆ తర్వాత ఆయన చేసిన సేవలు 'రీల్ విలన్ నుంచి రియల్ హీరోగా మార్చాయి. కరోనా మొదటి వేవ్ సమయంలో సోనూ సొంత ఊళ్లకు వెళ్లేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వారికి తన సొంత డబ్బుతో వాహనాలు ఏర్పాటు చేయించి వారి సొంత ఊర్లకు తరలించాడు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా చాలామందికి సాయం చేశాడు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత తీర్చడంలో సోను సూద్ తన వంతు ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం దేశం లోని అన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్ లు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తన్నాడు. 

కేవలం కరోనా అని మాత్రమే కాకుండా వేరే ఆరోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్టు తెలిసినా సోను సూద్ తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టి సేవలు చేశాడు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో దంపతులు తమ కూతురికి సోను సూద్ పేరు పెట్టుకున్నారు. తమ కూతురు గుండె జబ్బుతో బాధ పడుతోందని ఆమెకు వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు సోనూ ను ఆశ్రయించారు. దాంతో సోనూ సూద్ వెంటనే ఆమెకు వైద్యం చేయించాడు. ఆ పాప ఇప్పుడు కోలుకొని ఇంటికి వచ్చింది. దాంతో సంతోషంలో ఉన్న తల్లిదండ్రులు ఆమెకు 'సోనూ' అని పేరు పెట్టుకున్నారు.

More Related Stories