ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మళ్ళీ ప్రాణం పోసుకుని వచ్చాడా అన్నట్లుందిగా.. SP Balasubrahmanyam
2020-10-17 14:01:09

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయి మూడు వారాలు అవుతున్నా కూడా ఇప్పటికే ఆయనను మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. కళ్ళముందు భౌతికంగా ఆయన కనిపించకపోయినా ఆయన పాటలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటికీ బాలసుబ్రమణ్యం పాట వినకుండా మనకు రోజు గడవదు. ఆయన పాట విన్నప్పుడు బాలు ఇక లేడు అనే నిజాన్ని కూడా నమ్మలేకపోతున్నారు అభిమానులు. బాలు స్వరం విన్నప్పుడు ఆయన చనిపోయాడా అనే అనుమానం కూడా వస్తుంది. సజీవంగా ఆయన గొంతులో మనకు వినిపిస్తున్నాడు. జులైలో ఒక ఛానల్ నిర్వహించిన ఈ ఈవెంట్ కు వచ్చిన బాలసుబ్రమణ్యం అక్కడే కరోనా బారిన పడ్డాడు. అది మొదలు దాదాపు యాభై రోజుల పాటు హాస్పిటల్ లో ఆయన మృత్యువుతో పోరాడాడు. చివరికి ఆరోగ్యం విషమించి సెప్టెంబరు 25న కన్నుమూసాడు బాలసుబ్రమణ్యం. లాక్ డౌన్ ముందు వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన మనిషి ఒక్కసారిగా మరణించడంతో అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా కన్నీళ్లు పెట్టుకుంది.

ఆయన ఉండుంటే ఇంకా ఎన్నో వేల పాటలకు స్వరార్చన చేసేవాళ్ళు. అలాంటి బాలసుబ్రమణ్యం జ్ఞాపకాలను ప్రజలకు ఇచ్చేందుకు గాను ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్.. బాలు విగ్రహం తయారు చేశారు. ఈస్ట్ గోదావరి శిల్పి రాజ్ కుమార్ వద్ద బాలు గతంలో తన తల్లిదండ్రుల విగ్రహాలను తయారు చేయించారు. బతికి ఉండగానే తన విగ్రహంను తయారు చేయాల్సిందిగా బాలు రాజ్ కుమార్ కు చెప్పాడు. పరిస్థితులు చక్కబడిన తర్వాత తాను వచ్చి ఈ విగ్రహం తీసుకుంటాను అని చెప్పాడు బాలసుబ్రహ్మణ్యం. కానీ అంతలోనే దారుణం జరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆ విగ్రహం పూర్తయిపోయింది. దీనికి సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది. ఇది చూసిన తర్వాత నిజంగానే బాలసుబ్రమణ్యం మళ్ళీ ప్రాణం పోసుకొని తిరిగి వచ్చాడు కనిపిస్తుంది. సహజత్వం ఉట్టి పడేలా విగ్రహాలను తీర్చి దిద్దడం రాజ్ కుమార్ ప్రత్యేకత. బాలు విగ్రహంలోనూ ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. బాలు జ్ఞాపకార్థం ఆయన అభిమానులు చాలా చోట్ల విగ్రహాలను ప్రతిష్టించేందుకు సిద్దం అవుతున్నారు. తెలుగు ప్రభుత్వాలు కూడా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. 

More Related Stories