ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్SP Balasubrahmanyam
2020-08-05 14:36:08

దేశంలో కరోనా వైరస్ రోజరోజుకు విజృంభిస్తూనే ఉంది. ముందుగా సామాన్యులకే పరిమితం అయిన ఈ కరోనా ఇపుడు సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. బాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. నిన్న సింగర్ స్మిత కరోనా బారిన పడగా ఇప్పుడు తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో కరోనా పరిక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం చెన్నై లో నివాసం ఉంటున్నారు. అక్కడే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య౦ నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది.ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా ఎస్పీబీ అభిమానులకు తెలియజేశారు. "గత రెండు రోజులుగా జ్వరం ,దగ్గుతో బాధపడుతున్నాను. వైద్య పరీక్షల అనంతరం కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంది. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దు. ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. మీ అశీస్సులతో తొందరలోనే కోలుకుంటాను”. అని ఎస్పీబీ వీడియోలో పేర్కొన్నారు.

More Related Stories