కోయంబత్తూరులో ఎస్పీబీ వనం..ఎన్ని ప్రత్యేకతలో



SPB Vanam
2020-12-17 09:57:46

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా మృతిచెందిన సంగతి తెలిసందే. ఆంధ్రప్రదేశ్ వాసి అయినప్పటికీ ఎస్పీబి తెలుగుతో పాటు ఇతర భాషల్లో పాటలు పాడి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే తెలుగు కంటే ఇతర భాష చిత్రల్లోనే ఆయనకు ఎక్కువ గుర్తింపు కూడా లభించింది. బాలు మరణం తరవాత ప్రముఖ బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు నివాళులు అర్పించారు. ఇక ఆయన మరణం అనంతరం ఏపీ ప్రభుత్వం ఆయనకు గుర్తుగా నెల్లూరు లోని మ్యూజిక్ కళాశాలకు ఆయన పేరును పెడుతూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా తాజాగా బాలు గుర్తుగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కోయంబత్తూరు లో "ఎస్పీబీ వనం"  పేరుతో ఓ పార్కును నిర్మించి నివాళులు అర్పించింది. "సితురిలి" అనే స్వచ్చంధ సంస్థ బాలు పేరిట ప్రత్యక పార్కును ఏర్పాటు చేసింది. ఈ పార్కు ఆవిష్కరణ వేడుకలో ఎస్పీబీ కుమారుడు..ఎస్పీ చరణ్, కూతురు శైలజ లు పాల్గొన్నారు. చనిపోయేనాటికి ఎస్పీబీ వయస్సు 74 సంవత్సరాలు. కాబట్టి ఈ వనంలో మొత్తం 74 మొక్కలను నాటారు.  అంతే కాకుండా ఒక్కో మొక్కకు బాలు పాడిన పాటను పెట్టడం విశేషం. మొక్కలన్నింటిని సంగీత స్వరం ఆకారంలో నాటారు. ఈ మొక్కలు కూడా సంగీత వాయిద్యాలు తయారు చేసే కలపకు చెందినవి కావటం విశేషం. కోయంబత్తూరు శివార్లలో పచ్చప్పాలయం వద్ద లైబ్రరీని, పిల్లలు ఆదుకునే పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు "సిరుతులి" సంస్థ పేర్కొంది.

More Related Stories