ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చివరి పాట ఏంటో తెలుసా.. Rajinikanths Annaatthe
2020-09-26 13:54:45

లెజెండ్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎన్నో వేల పాటలు పాడారు. ఆయన గాత్రంలో ప్రాణం పోసుకున్న పాటలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఏ హీరోకు పాడితే అలా ఆయన మ్యాజిక్ చేసే వాళ్ళు. గత 50 సంవత్సరాలుగా ఆయన పాట కూడా మన జీవితంలో భాగమైపోయింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం పాట వినకుండా ఒక్కరోజు కూడా గడవదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి అమర గాయకుడు పాడిన చివరి పాట ఎంతో తెలుసా.. అది ఏ హీరో కోసం పాడాడో తెలుసా.. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నాతే సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ పాడాడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. రజనీకాంత్ హీరోగా వచ్చిన చాలా సినిమాలలో ఆయన ఇంట్రడక్షన్ సాంగ్స్ బాలసుబ్రహ్మణ్యం పాడాడు. మొన్న సంక్రాంతికి విడుదలైన దర్బార్ సినిమాలో కూడా దుమ్ము ధూళి అంటూ రచ్చ చేశాడు బాలు. దానికి ముందు పేట సినిమాలో కూడా ఇంట్రడక్షన్ సాంగ్ బాలు పాడారు. 

ఇప్పుడు ఆయన చివరి పాట కూడా రజినీకాంత్ కోసమే పాడాడు. లాక్ డౌన్ కు కొద్ది రోజుల ముందు ఈ పాటను రికార్డు చేశారు. ఇదే అంశాన్ని సంగీత దర్శకుడు డి ఇమాన్ సోషల్ మీడియాలో తెలియజేశాడు. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తారని ఆయన తెలిపాడు. దాంతో బాలు పాడిన చివరి పాట కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి 1966లో శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో ఆరంభమైన ఈ గాయకుడి ప్రయాణం రజనీకాంత్ సినిమాతో ముగిసింది. ఈ ఏడాది కూడా బాలు నుంచి ఒక అద్భుతమైన పాట వచ్చింది. రవితేజ డిస్కో రాజా సినిమాలో నువ్వు నాతో ఏమన్నావో అనే పాట చాలా పెద్ద హిట్ అయింది. హాస్పటల్లో చేరడానికి కొన్ని రోజులముందు ఒక స్టేజి పై ఈ పాట ఆలపించాడు బాలు. 

More Related Stories