శ్రీ విష్ణు రాజ రాజ చోర టీజర్ టాక్  Raja Chora Teaser
2021-06-18 15:41:31

ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో శ్రీవిష్ణు. తాజాగా ఈ యంగ్‌ హీరో నటిస్తున్న మరో విభిన్నమైన చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్‌ – సునయన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఎంటర్టైనర్‌ ని హసిత్‌ గోలి తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ టీజర్ చూస్తుంటే.. శ్రీ విష్ణు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా, దొంగగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 'రాజ రాజ చోర' అనే టైటిల్‌కు తగ్గట్టుగానే దొంగతనాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఆసక్తికరంగా సాగుతుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో నటుడు రవిబాబు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. యూట్యూబ్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఆమెతో శ్రీ విష్ణు చీర్స్ అంటున్న సీన్ టీజర్‌లో హైలైట్ అయింది. సో.. చూడాలి మరి ఈ సినిమాతో శ్రీ విష్ణు ఏ రేంజ్‌లో నవ్విస్తారనేది!.

More Related Stories