శ్రీ విష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ `రాజ రాజ చోర‌`.. ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌



sree-vishnus-raja-raja-chora-on-august-19
2021-08-11 22:22:49

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ `రాజ రాజ చోర‌`. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన ఎంట‌ర్‌టైనింగ్ టీజ‌ర్‌, పాట‌లు స‌హా ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు ప్రేక్ష‌కాభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. నిర్మాత‌లు ఈ సినిమాను ఆగ‌స్ట్ 19న విడుద‌ల చేస్తున్నట్లు తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల్లో ప్ర‌తి ఒక్క‌రూ హాయిగా న‌వ్వుకోవాల‌ని, మంచి సినిమాల‌ను చూడాల‌నుకుంటున్నారు. `రాజ రాజ చోర‌` ఈ అప‌రిమిత‌మైన వినోదాన్ని అందించ‌డం ఖాయం అని అంద‌రూ భావిస్తున్నారు.

`రాజ‌రాజ చోర‌` చిత్రంలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగ‌గా హిలేరియ‌స్ పాత్రలో క‌నిపించ‌బోతున్నారు. మేఘా ఆకాశ్ మెయిన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్‌గా సునైన క‌నిపించ‌నుంది. హితేశ్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వేద రామ‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని అందించారు. శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్‌, సునైన‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గంగ‌వ్వ‌, అజ‌య్ ఘోష్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూస‌ర్‌: వివేక్ కూచిబొట్ల‌, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: క్రితి చౌద‌రి, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ: వేద రామ‌న్‌, ఎడిటింగ్‌: విప్ల‌వం నైష‌దం, ఆర్ట్: కిర‌ణ్ కుమార్ మ‌న్నె, స్టైలింగ్‌: శ్రుతి కూరపాటి, నిర్మాత‌లు: టి.జి.విశ్వ ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: హితేశ్ గోలి
 

More Related Stories