తిప్పరామీసం రిలీజ్ డేట్ లాక్...రైట్స్ కొన్న ప్రముఖ సంస్థSree Vishnu
2019-10-12 11:26:26

అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ వంటి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. తాజాగా ఈయన హీరోగా తిప్పరా మీసం అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఇప్పటి వరకు సాఫ్ట్ అండ్ లవ్ స్టోరీస్ తో అలరించిన శ్రీవిష్ణు ఈ సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు. ఎన్నడూ లేనేంత గా కొవర్ అయ్యాడు. ‘తిప్పరా మీసం’ సినిమాలో  శ్రీవిష్ణు పూర్తి గెడ్డంతో అతన్ని గుర్తుపట్టలేని విధంగా అతని లుక్ ఉంది. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ‘అసుర’ సినిమాను డైరెక్ట్ చేసిన కృష్ణ విజయ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. 

ఈ సినిమాతో తమిళ భామ నిక్కి తంబోలి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తోన్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో రిజ్వాన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. గత నెలలో తిప్పరా మీసం టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజైన నిమిషాల్లోనే ఆ టీజర్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఇక ఈ సినిమా వచ్చే నెల ఎనిమిదవ తారీఖున రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ హక్కులు ఏసియన్ సినిమాస్ సంస్థ కొనుక్కుంది. ఆ సంస్థ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. బ్రోచేవారేవరురా సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో ఈ సినిమాతో కూడా హిట్ కొడతాడేమో చూడాలి మరి.

More Related Stories