శ్రీకారం ఫస్ట్ వీక్ కలెక్షన్స్



Sreekaram
2021-03-18 17:59:20

యంగ్ హీరో శర్వానంద్ నటించిన సినిమా శ్రీకారం. ఈ సినిమాను నూతన దర్శకుడు కిషోర్ బి తెరకెక్కించారు. సినిమాలో శర్వానంద్ కు జంటగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. వ్యవసాయం పై మంచి సందేశం తో ఈ సినిమాను తెరకెక్కించారు. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.  అంతే కాకుండా సినిమాకు భారీగా ప్రమోషన్స్ చేశారు. ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చ్ 11న విడుదలయింది. కాగా సినిమాకు మొదటి షో నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. మొదటి రోజు కలెక్షన్స్ పర్వాలేదు అనిపించగా..రెండో రోజు నుండి మాత్రం డల్ అయ్యాయి.  

ఇక ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే...ఈ సినిమాకు 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 17. 5 కోట్లు రాబట్టాలి. కానీ 7 రోజులు పూర్తయ్యేసరికి కేవలం 9.13 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 7.87 కోట్ల కోట్ల షేర్ ను రాబట్టాలి. అంత మొత్తం రబట్టాల్సి ఉంది అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే చెప్పాలి. ప్రాంతాల వారిగా కలెక్షన్స్ చూసుకుంటే ఈ చిత్రానికి ఏపీ తెలంగాణ మొత్తం 8.44 కోట్ల కలెక్షన్స్ రాగా..రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 కోట్లు, ఓవర్సీస్ 0.39 కోట్లు వచ్చాయి. మొత్తం వరల్డ్ వైడ్ గా 9.13 కోట్లు వచ్చాయి.

More Related Stories