శ్రీకారం రివ్యూ



 Sreekaram
2021-03-11 15:36:08

శతమానం భవతి తర్వాత ఆనందగిరి ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. ఇలాంటి సమయంలో వ్యవసాయం నమ్ముకొని ఆయన చేసిన సినిమా శ్రీకారం. మరి ఇది ఎలా ఉందో చూద్దాం..

కథ:  కార్తీక్ (శర్వానంద్) సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైదరాబాదులో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ నెలకు లక్షలు సంపాదిస్తుంటాడు. అదే సమయంలో అమెరికా వెళ్లే అవకాశం కూడా వస్తుంది. కానీ బంగారం లాంటి అవకాశమే వదులుకొని వ్యవసాయం చేయడానికి ఊరికి వస్తాడు. మరోవైపు కార్తీక్ అంటే చైత్ర (ప్రియాంక మోహన్) కు చాలా ఇష్టం. అతని కోసం ఆమె కూడా ఊరికి వస్తుంది. కానీ వ్యవసాయం చేయాలని కార్తీక్ తీసుకున్న నిర్ణయం అతని తండ్రి (రావు రమేష్)కి నచ్చదు. కానీ వ్యవసాయంపై ఇష్టంతో కార్తిక్ ఏం చేశాడు అనేది మిగిలిన కథ..

కథనం: విషయం వినోదాత్మకంగా చెబితే.. వ్యవసాయం కూడా చాలా అందంగా ఉంటుంది. గతేడాది భీష్మ విషయంలో వెంకీ కుడుముల ఇదే నిరూపించాడు. ఇప్పుడు శ్రీకారం సినిమా విషయంలో దర్శకుడు కిషోర్ ఇదే చేశాడు. తినేవాడు తలపై జట్టు అంత ఉంటే.. పండించేవాడు మూతి మీద మీసం అంతున్నారు. ఈ ఒక్క మాటతో తాను సినిమాలో ఏం చెప్పాలనుకున్నాడో ముందుగానే అందరిని సిద్ధం చేశాడు. తాను అనుకున్న కథను అనుకున్నట్లుగా స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడు. దీనికోసం అనవసరపు హడావిడికి పోలేదు. కథను సూటిగా సుత్తిలేకుండా ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు దర్శకుడు. వ్యవసాయం అనే మాటే మరిచిపోతున్న తరుణంలో.. చదువుకున్నవాడు వ్యవసాయం చేస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాలో చూపించాడు. సందేశం ఇచ్చినట్లు కాకుండా కథనం ఆసక్తికరంగా నడిపించాడు. వ్యవసాయంలో రైతుల బాధలు కాకుండా.. అందులో ఉండే ఆనందాన్ని చూపించాడు దర్శకుడు. ఫస్టాఫ్ పర్లేదు.. సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తో నింపేసాడు. ల్యాగ్ సీన్స్ కొన్ని ఉన్నా కూడా మరీ అవి సినిమాపై అభిప్రాయాన్ని మార్చేలా లేవు. 

నటీనటులు:  శర్వానంద్ మంచి నటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియాంక మోహన్ పర్లేదు.. రావు రమేష్, నరేష్ బాగా సపోర్ట్ చేశారు. సాయి కుమార్ కూడా తన సాఫ్ట్ విలనిజం చూపించాడు. సత్య కామెడీ పర్లేదు. 

టెక్నికల్ టీం: మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. రెండు పాటలు నచ్చాయి. శ్రీకారం టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగినట్లు అనిపించాయి. సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంది. కొత్త దర్శకుడు కిషోర్ కమర్షియల్ పంథా కాకుండా మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

చివరగా: ఓవరాల్ గా శ్రీకారం.. ఎమోషనల్ రైడ్..

రేటింగ్: 3/5.

More Related Stories