నిజామాబాద్ లో ఇల్లు కట్టుకుంటున్న శ్రీముఖి Sreemukhi
2020-12-04 17:12:51

తెలుగులో టాప్ యాంకర్ లలో ఒకరు యాంకర్ శ్రీముఖి. గలగలా మాట్లాడుతూ శ్రీముఖి అందరిని ఆకర్షిస్తోంది. పటాస్ షోతో శ్రీముఖి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు అడపా దడాపా సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతోంది. అంతే కాకుండా గత బిగ్ బాస్ సీజన్లో ఎంట్రీ ఇచ్చి రన్నారప్ గా నిలిచింది. శ్రీముఖి గలగలా మాట్లాడటమే కాకుండా అందంతోనూ అభిమానులను కట్టిపడేస్తుంది.   ఇదిలా ఉండగా శ్రీముఖి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. తన సొంతూరు నిజామాబాద్ జిల్లాలో శ్రీముఖి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా గడప ఏర్పాటు పూజ కార్యక్రమాలు నిర్వహించింది. శ్రీముఖి తన కొత్త ఇంటి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More Related Stories