నా ఉసురే తగిలింది.. ఐడి దాడులపై శ్రీ రెడ్డి సంచలన పోస్ట్..  Sri Reddy
2019-11-21 21:06:09

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఐటి దాడుల కలకలం బాగానే రేగుతుంది. అలజడి లేకుండా సంచలనంగా రైడ్స్ చేసింది ఐటి శాఖ. సినిమాకు దాదాపు 8 కోట్ల వరకు తీసుకునే నాని.. ఏడాదికి పదుల కోట్లు సంపాదించే నిర్మాత సురేష్ బాబు ఇళ్లపై ఐటి దాడులు జరగడం సంచలనమే. ఇప్పుడు దీనిపై టాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఐటి దాడులను సమర్థిస్తూ రెచ్చిపోయింది ఈమె. హైదరాబాద్‌లో జరిగిన ఐటీ దాడులపై ఆమె చాలా సంతోషపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది. ఎప్పట్నుంచో టార్గెట్ చేస్తున్న వాళ్లపైనే ఇప్పుడు ఐటి దాడులు జరగడంలో ఎగిరి గంతేస్తుంది. చాలా రోజుల వరకు సురేష్ బాబు తనయుడు అభిరామ్‌తో రిలేషన్ లో ఉంది శ్రీ రెడ్డి. ఈ డేటింగ్ సీక్రేట్స్ కూడా అప్పట్లో ఫోటోలతో సహా బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక నానిపై కూడా చాలా రోజుల నుంచి ఆమెకు కోపం ఉంది. తనను లైంగికంగా వాడుకున్నాడని హీరో నానిపై చాలా ఏళ్లుగా ఆమె నోరు పారేసుకుంటుంది. ఆ హీరోపై కూడా ఐటి దాడులు జరగడంతో మనశ్శాంతిగా కనిపించింది శ్రీ రెడ్డి. అందుకే దేవుడు ఉన్నాడు సురేష్ బాబు గారూ అంటూ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. మరోవైపు మోదీజీ థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేసింది కూడా. శ్రీ రెడ్డి కమెంట్స్ చూసి చాలా మంది ఆమెకు సపోర్ట్ చేస్తుండటం విశేషం. మరికొందరు విమర్శిస్తున్నారు కూడా. అసలు నిజాలు పక్కనబెడితే శ్రీ రెడ్డి టార్గెట్ అయిన సురేష్ బాబు, నాని ఇంటిపై ఐటి దాడులు మాత్రం యాదృశ్చికమే.

More Related Stories