మీ దగ్గర కత్తిలా ఉంటా..నన్ను రంగంలోకి దింపండి : శ్రీరెడ్డిSri Reddy
2021-06-21 17:33:59

సినీ నటి శ్రీరెడ్డి ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు ఏమీ చేయకపోయినా ఎప్పుడు ఏదో ఒక ఒక టాపిక్ తో వార్తల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి కి ఫాలోయింగ్ ఎక్కువ ఉండడంతో ఫోటో షూట్ల తో వీడియోలతో రెచ్చిపోతుంది. అంతేకాకుండా సామాజిక, రాజకీయ అంశాలపై తన స్టైల్లో స్పందిస్తూ ఉంటుంది. ఇక ఏపీ ప్రభుత్వం పై శ్రీ రెడ్డి ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా టీడీపీపై విమర్శలు కూడా ఓ రేంజ్ లో చేస్తుంది. అయితే తాజాగా శ్రీ రెడ్డి ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది. 

ఏకంగా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని శ్రీరెడ్డి భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు చాన్స్ ఇవ్వాలంటూ సీఎం జగన్ కు సోషల్ మీడియా ద్వారా శ్రీ రెడ్డి రిక్వెస్ట్ చేసింది. శ్రీ రెడ్డి తన సోషల్ మీడియాలో "జగన్ గారు ఎదవల కోసం నన్ను డైరెక్ట్ పాలిటిక్స్ రంగంలోకి దింపాలని విజ్ఞప్తి చేస్తున్నా. ముల్లును ముల్లుతోనే తీయండి. మీ దగ్గర సర్రుమని తెగే కత్తిలా ఉంటా. ఏకే 47 లా పడి ఉంటాం. మీ జోలికి వచ్చిన వాడి తల ఎగిరిపోవాల. టైం చూసి నాకు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నా." అంటూ  పొలిటికల్ స్టైల్ లో ఫోటోకు పోజు ఇచ్చింది.

More Related Stories