దయచేసి ఆ ఫోటోలు షేర్ చేయకండి..శ్రీరెడ్డి రిక్వెస్ట్



Sri Reddy
2021-03-04 13:39:21

టాలీవుడ్ కు లీకుల బెడద పట్టుకుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా, పవన్ క్రిష్ సినిమాల నుండి ఫిక్స్ లీక్ అవ్వగా తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫిక్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోటోల్లో ఎన్టీఆర్ సంకెళ్ళు తెంచుకుంటున్నట్టు కనిపిస్తున్నాడు. ఇక అల్లూరి పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్  బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. మరోవైపు ఒలీవియా ఎన్టీఆర్ ల ఫోటో కూడా లీక్ అయ్యింది. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సినిమా నుండి ఫోటోలు లీక్ అవ్వడం ఆందోళన కలిగిస్తుంది.

అయితే తాజాగా ఈ ఫోటోలు లీక్ అవ్వడం పై వివాదస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. "లీకైన ఫోటోలు చూస్తుంటే నాకు..ఒక్క విషయం అర్థమవుతుంది. రాజమౌళి చెప్పినట్టు ఏ సినిమా కచ్చితంగా 2000 కోట్ల సినిమా అవుతుంది..జై ఎన్టీఆర్..దయచేసి లీక్ అయ్యిన ఫోటోలు షేర్ చేయకండి. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇదిలా ఉండగా శ్రీరెడ్డి టాలీవుడ్ లో పలువురిపై సంచలన ఆరోపణలు చేయడంతో మా అసోసియేషన్ నుండి తొలగించారు. దాంతో చెన్నై కి మాకాం మార్చి అక్కడే ఉంటోంది.

More Related Stories