జీవితను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి...అది కూడా బెడ్ రూమ్ లో చేసే పనేగా ?srireddy
2019-07-14 09:23:36

విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ, జీవిత రాజశేఖర్ డాటర్ శివాత్మిక రాజశేఖర్ ల మొదటి సినిమా దొరసాని ఈ శుక్రవారం నాడు విడుదలై పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. 1987లో వరంగల్ లో జరిగిన ఒక యధారద ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు కేవీఆర్ మహేంద్ర. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో యూనిట్ అంతా మంచి సెలెబ్రేషన్ మూడ్ లో ఉండగా దొరసాని సినిమాను టార్గెట్ చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. శివాత్మిక తల్లి జీవితతో ఉన్న పాత గొడవలని గుర్తు తెచ్చుకుని మరీ గతంలో ఇండస్ట్రీని ఉద్దేశించి జీవిత మాట్లాడిన మాటల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ సందర్భంగా.. ‘సినిమాల్లో లిప్ లాక్‌లు ఎక్కువైపోతున్నాయి.. బెడ్ రూంలో చేయాల్సిన పనులు రోడ్ మీద చేస్తామా’ అంటూ జీవిత చేసిన కామెంట్స్‌ని గుర్తు చేస్తూ నాటి వీడియోను షేర్ చేసిన శ్రీ రెడ్డి ‘జీవిత గారూ ఇది మీకు గుర్తుందా’ అంటూ ఆ వీడియో షేర్ చేసింది శ్రీరెడ్డి. మరోపోస్ట్‌లో ‘దొరసాని’ సినిమా హిట్టా? ఫ్లాపా? శివాత్మిక రాజశేఖర్‌ని కిస్ చేశాడా ఆనంద్ దేవరకొండ. ఈ టాపిక్‌పై ఫేస్ బుక్‌ లైవ్‌లోకి వస్తున్నా అంటూ మరో  పోస్ట్ వదిలింది శ్రీరెడ్డి. ‘జీవిత గారు నీ కూతురు దగ్గరకి వచ్చేసరికి ఎన్ని పత్తిత్తు కబుర్లు చెప్తున్నారో ఒకసారి తవ్వుకుందాం .. మీరెలాగూ మూవీ అసోషియేషన్ కార్డుకి అడ్డం పడుతున్నారని తెల్సు.. స్టిల్(అయినా) మాట్లాడతా’ అంటూ సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

 

More Related Stories