అవ‌స‌రాల శ్రీనివాస్ నిజ‌స్వ‌రూపం బ‌య‌టపెట్టిన కోడైరెక్ట‌ర్



Srinivas Avasarala
2021-03-24 14:17:55

అవ‌స‌రాల శ్రీనివాస్ న‌టుడిగా మ‌రియు ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా అవ‌స‌ర‌వాల శ్రీనివాస్ పై ఆరోప‌ణలు చేస్తు అత‌డివ‌ద్ద కోడైరెక్ట‌ర్ గా ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తి వీడియోను రిలీజ్ చేసాడు. ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియోలో కోడైరెక్ట‌ర్ అవ‌స‌రాల శ్రీనివాస్ త‌న‌ను అవ‌మాన పరిచాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా తాను ఏమీ త‌ప్పు చేయ‌లేద‌ని కానీ శ్రీనివాస్ కార‌ణం కూడా చెప్ప‌కుండా తిట్టాడ‌ని అన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ నిజ‌స్వ‌రూపం భ‌య‌ట‌పెడ‌తా అంటూ సెల్ ఫోన్ లో వీడియో చిత్రిస్తూ ఫోటో షూట్ లో బిజీగా ఉన్న శ్రీనివాస్ వ‌ద్ద‌కు వెళ్ళాడు. దాంతో మ‌ళ్లీ ఇక్క‌డికెందుకు వ‌చ్చావ్..నిన్ను ఎవ‌రు రానిచ్చారు అంటూ అవ‌స‌రాల శ్రీనివాస్ వాదించాడు. 

అంత‌లోనే శ్రీనివాస్ పెట్టుకున్న క్యాప్ ను కోడెరెక్ట‌ర్ లాగేసాడు. అయితే సినిమాల్లో ఉంగ‌రాల జుట్టుతో క‌నిపించే అవ‌సరాల శ్రీనివాస్ వీడియోలో బ‌ట్ట‌త‌ల‌తో క‌నిపిస్తున్నాడు. ఈ వీడియో భ‌య‌ట‌కు వెళితే బాగుండ‌దు అంటూ శ్రీనివాస్ వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. ఇక ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూస్తుంటే మాత్రం పెద్ద సీరియ‌స్ గా క‌నిపించ‌డంలేదు. ఖ‌చ్చింతంగా ఏదో సినిమా ప్ర‌మోష‌న్ కోస‌మే వీడియోను చిత్రించారేమో అనే అనుమానాలు వ‌స్తున్నాయి. ఇదిలా ఉండ‌గా అవ‌స‌రాల శ్రీనివాస్ అష్టాచెమ్మా, అమితుమి సినిమాల్లో న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. అంతే కాకుండా నాగ శౌర్య హీరోగా వ‌చ్చిన ఊహ‌‌లు గుస‌గుస‌లాడే సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. 

More Related Stories