కొరటాల రాజమౌళి మధ్య ఒప్పందం... ఆయన సేఫ్...SSRajamouli Koratala Siva.jpg
2020-01-16 00:00:19

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుల హిట్ రేట్ ని బట్టి చూస్తే ముందు వరుసలో రాజమౌళి ఉంటారు. అయన తర్వాత కొరటాల కూడా భారీ సినిమాలే తీస్తూ ఫ్లాప్ అనేదే లేకుండా ముందుకు వెళ్తున్నాడు. ఆయన తాజాగా చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మొన్నీమధ్యనే షూట్ కి వెళ్ళింది. అయితే చిరంజీవి సినిమాలో చరణ్ నటిస్తున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అది నిజమేనని తెలుస్తోంది.

దానికి కారణం ఆయన చరణ్ ని 40 రోజుల కాల్ షీట్స్ అడగడమే. కానీ ప్రస్తుతం చరణ్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షెడ్యూల్ మొత్తం ఆయన మీదే షూట్ జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో డేట్స్ ఇవ్వగలనో లేదో అని మధన పడి కొరటాల రాజమౌళి ల మధ్య ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో తన బాధ కొరటాల రాజమౌళితో పంచుకున్నాదట. అయితే తన మూవీకి సంబంధించి చరణ్ తో తీయవలసిన సీన్స్ షూటింగ్ ఏప్రియల్ కు అయిపోతుంది కాబట్టి ఆ తరువాత చరణ్ తో తీయవలసిన షెడ్యూల్ పెట్టుకోవలసిందిగా రాజమౌళి కొరటాలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీనితో చిరంజీవి కొరటాల మూవీ ఈ సమ్మర్ లో విడుదల కావడం లేదని కుదిరితే ఈ ఏడాది దసరాకు లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదల ఉంటుంది అని అంటున్నారు.

More Related Stories