ఢిల్లీ విమానాశ్ర‌యంలో జక్కన్న కు చేదు అనుభవంSS Rajamouli
2021-07-02 13:29:15

దర్శకధీరుడు రాజమౌళి ఎప్పుడూ సినిమాల గురించి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సమాజంలో రావాల్సిన మార్పుల గురించి కూడా సామాజిక మాధ్యమాల ద్వారా జనాలకు తెలియజేస్తుంటారు . తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో ఈ దర్శకుడు ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం గురించి తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 

 "నేను అర్ధరాత్రి ఒంటిగంట  సమయంలో లుప్తనాసా విమానం దిగాను. అయితే అక్కడి అధికారులు ఆర్టిపిసిఆర్ టెస్ట్ చేయించుకోవాలని అందుకోసం నాకు ఒక దరఖాస్తు ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ లు తీసుకున్న ప్యాసింజర్స్ లో కొందరు వాటిని గోడకు ఆనిస్తూ నింపగా... మరికొందరు కింద కూర్చొని దరఖాస్తు ఫామ్ ని నింపుతున్నారు. 

ఇది నాకు అసలు నచ్చలేదు.. కనీసం అక్కడ  టేబుల్స్ నైనా ఏర్పాటు చేయవలసిందిగా దర్శకధీరుడు కోరాడు. అంతే కాకుండా దీనితోపాటు  విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే క్రమంలో రోడ్డు మీద చాలా కుక్కలు ఉన్నాయని పేర్కొన్నాడు.  కొత్తగా భారతదేశం వచ్చిన విదేశీయులకు ఇలాంటి అనుభవం ఎదురైతే...బాగుండదేమో అని అభిప్రాయ పడ్డారు. ఇక ఈ ట్వీట్ కు కొంత మంది అవును నేను కూడా ఢిల్లీ విమానాశ్రయం లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాను.  అంటూ కామెంట్లు పెడుతున్నారు.

More Related Stories