అఫీషియల్ ..మహేష్ తో రాజమౌళి సినిమాSS Rajamouli
2020-04-18 19:17:07

టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరక్టర్స్ అందరితో దాదాపుగా పని చేసిన మహేష్ ఒక్క రాజమౌళి డైరెక్షన్ లో మాత్రం ఇప్పటి వరకూ నటించ లేదు. అయితే వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఎప్పటి నుండో ప్రచారం జరిగేది. దుర్గా ఆర్ట్స్ అధినేత నారయణ రెండు మూడు సార్లు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఈ కాంబినేషన్ మీద చర్చ జరిగేది. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని జక్కన్న కన్ఫర్మ్ చేశాడు. బాహుబలి 2 బంపర్ విక్టరీతో జక్కన రేంజ్ హాలీవుడ్ స్థాయికి చేరిపోయింది. అందుకే ఆయన ఇప్పుడు మరో హాలీవుడ్ లెవెల్ సినిమా ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా ప్లాన్ చేయచ్చని అంటున్నారు. మ‌హేష్ బాబుతో సినిమా తెర‌కెక్కించ‌నున్నట్టు జక్కన్న అఫీషియ‌ల్‌ గా ప్రక‌టించాడు. దుర్గ ఆర్ట్స్ బేన‌ర్‌పై కేఎల్ నారాయ‌ణ చిత్రాన్ని నిర్మించ‌నున్నారని అంటున్నారు. నిజానికి మహేష్ శ్రీమంతుడు టైమ్ లోనే రాజమౌళితో సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా బాహుబలి గొడవలో అది సాధ్యం కాలేదు. ఇక ఈరోజు అందిన తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది రాజమౌళి-మహేష్ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైనట్టే.  

More Related Stories