పుష్ప రాధేశ్యామ్ సినిమాలకు ఛాలెంజ్ విసిరిన ఆర్ఆర్ఆర్ టీమ్



SS Rajamouli
2020-11-11 13:56:28

టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రజాప్రతినిధులతో పాటు సెలబ్రెటీలు సైతం ఈ ఛాలెంజ్ ను సవీకరించి మొక్కలు నటుతున్నారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే పలువురు టాలీవుడ్ , బాలీవుడ్ , కొలీవుడ్ తారలు మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ సైతం మొక్కలు నాటారు. అనంతరం ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి చరణ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు.

ఇక తాజాగా చరణ్ విసిరిన ఛాలెంజ్ ను సవీకరించిన ఆర్ఆర్ఆర్ టీమ్ దర్శకధీరుడు రాజమౌళి ఆధ్వర్యంలో మొక్కలు నాటింది. అనంతరం ఈ ఛాలెంజ్ ను పుష్ప, రాధేశ్యామ్, ఆచార్య చిత్ర యూనిట్ లకు విసిరింది. ఇక ఇప్పటివరకు కేవలం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కేవలం ఒకరికి మరొకరు ఇచ్చుకునేవారు. ఇక చరణ్ ఆర్ఆర్ఆర్ టీమ్ కు ఇవ్వడం...ఆర్ఆర్ఆర్ టీమ్ పుష్ప,ఆచార్య,రాధే శ్యామ్ చిత్ర యూనిట్ లకు ఇవ్వడంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింత వేగంగా విస్తరించనుంది. అంతే కాకుండా టీమ్ సభ్యులందరు కలిసి మొక్కలు నాటడంతో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటడం జరుగుతుంది కాబట్టి ఛాలెంజ్ ఉద్దేశ్యం కూడా త్వరగా నెరవేరే అవకాశం ఉంది.

More Related Stories