దేవిశ్రీ పై తమన్ ఎఫెక్ట్.. బన్నీ టార్చర్..? నిజమేనా..?sri
2020-01-23 14:22:05

ఇటీవల వచ్చిన చిత్రాల్లో 'అల వైకుంఠపురంలో' సినిమా ఆడియో పరంగా ఎంతగా పాపులర్ అయిందంటే.. కేవలం ఇండియాలోనే కాదు.. మన శత్రుదేశమైనా పాకిస్థాన్ లో ముఖ్యంగా యువతను ఉర్రుతులూగిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో సంగీత దర్శకుడు తమన్.. టాప్ ప్లేస్ లో ఉన్నాడనే చెప్పొచ్చు. తమన్ ఇచ్చిన పాటలు దేనికవే ప్రత్యేకంగా నిలిచాయి.. ముఖ్యంగా సామజవరగమన.. పాట అయితే ఎవర్ గ్రీన్ గా నిలిచింది. అయితే.. ఇదే ఇప్పుడు దేవిశ్రీపై ఎఫెక్ట్ చూపిస్తోందనే చర్చ మొదలైంది.
 
ఆర్య చిత్రం నుంచి మొదలైన అల్లు అర్జున్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్ని మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. అలాంటిది.. బన్నీ-సుకుమార్ కాంబోలో తెరకెక్కబోతున్న కొత్త చిత్రం కోసం బన్నీ, దేవిని టార్చర్ చేస్తున్నట్టు.. ఫిల్మ్ నగర్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అల వైకుంఠపురంలో పాటల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. మళ్లీ ఆ రేంజ్ ట్యూన్స్ కోసం స్వయంగా బన్నీనే రంగంలోకి దిగినట్టు.. చాలా కేర్ తీసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. అంతేకాదు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే ట్యూన్స్ ని ఒకటికి పదిసార్లు చెక్ చేసి మరి ఒకే చేస్తున్పట్టు టాక్.

ఇప్పటికే దేవి మూడు పాటలకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడట. అలాగే.. మిగతా పాటల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదట బన్నీ. లేట్ అయినా పర్లేదు.. అల వైకుంఠపురంలో రేంజ్ లో ఔట్ పుట్ రావాలని పట్టుపడుతున్నాడట. అయితే.. బన్నీ, దేవిశ్రీని అనుమానించడం ఏంటని.. కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. అయితే.. సుకుమార్ పాటల సెలక్షన్ వండర్ గా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా దేవి-సుక్కు కాంబో ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. అలాంటప్పుడు అల్లు అర్జున్ కు టెన్షన్ అవసరమా అంటున్నారు. ఇందులో నిజనిజాలేంటోగాని ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

More Related Stories