బ్లాక్ బస్టర్ కొడుతున్నారు.. డిజాస్టర్ ఇస్తున్నారు.. హీరోల కన్ఫ్యూజన్. Prabhas
2019-08-31 16:36:20

తెలుగు ఇండస్ట్రీలో ఇపుడు ఇదే జరుగుతుంది. ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత ఆ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారు హీరోలు. వెంటనే మరో డిజాస్టర్ ఇచ్చి లెక్క సరి చేస్తున్నారు. సూపర్ స్టార్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. చిన్న హీరోలంటే కథలో కన్సిస్టెన్సీ లేక ఫ్లాపులు ఇస్తున్నారులే అనుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద హీరోలకు కూడా తప్పడం లేదు. ఇండస్ట్రీని షేక్ చేసే ఒక భారీ బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత వెంటనే డిజాస్టర్ కథలకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ విషయంలో కూడా ఇదే జరిగింది. సాహో సినిమాతో మరోసారి చరిత్ర సృష్టించాలని ముందడుగు వేసిన యంగ్ రెబల్ స్టార్ కు ఈ సినిమా ఊహించని ఫలితం ఇచ్చేలా కనిపిస్తోంది. కుర్ర దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ వరకు పర్లేదు అనిపించినా.. లాంగ్ రన్ లో మాత్రం భారీ నష్టాలు తీసుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి ముందు బాహుబలితో 10 రెట్లు ఇమేజ్ పెంచుకున్న ప్రభాస్ ఇప్పుడు తన స్థాయి తనే తగ్గించుకున్నాడు. రామ్ చరణ్ కూడా రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ కొట్టి వెంటనే వినయ విధేయ రామ సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదితో హిట్ కొట్టి ఆ తర్వాత అజ్ఞాతవాసి వరకు అన్ని ఫ్లాపులే ఇచ్చాడు. శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత మహేష్ బాబు ఆ సక్సెస్ కంటిన్యూ చేయలేకపోయాడు. వెంటనే బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి డిజాస్టర్ సినిమాలు ఇచ్చాడు. అల్లు అర్జున్ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. సరైనోడు సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయనకు విజయం లేదు. వీళ్లే కాదు ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది హీరోలు కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ కంటిన్యూ చేయడంలో విఫలం అవుతున్నారు. ఆత్మవిశ్వాసమో అతివిశ్వాసమో తెలియదు కానీ హిట్ కొట్టిన వెంటనే కథల ఎంపికలో మన హీరోలు తడబడుతున్నారు. ఇది ప్రాక్టికల్ గా కనిపిస్తున్న నిజం. మరి దీన్ని మన వాళ్ళు ఎప్పుడు మార్చుకుంటారో చూడాలి.

More Related Stories