అల.. వైకుంఠపురంలో టైటిల్ ఎందుకో ?Ala Vaikuntapuram Lo
2019-08-16 16:20:44

త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురములో అనే టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ముందుగా నాన్న-నేను, అలకనంద అనే టైటిల్స్ ప్రచారం జరిగినా వినిపించాయి. ఆ తర్వాత వైకుంఠపురంలో అనే టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ టైటిల్ దాదాపు ఖాయమనుకున్నా త్రివిక్రమ్ సప్రైజ్ చేస్తూ అల.. వైకుంఠపురంలో టైటిల్ ని ఫైనల్ చేశారు. చాలా విచిత్రమైన టైటిల్ ఇది. అలా ఎందుకుపెట్టారనే దానిని పరిశీలిస్తే ఇది ఒక భాగవత పద్యం నుండి తీసుకున్నాడని తేలింది. అయితే ఈ పద్యం అల వైకుంఠ పురంబులో  నగరిలో నామూలసుధంబు  దా, 
పల మందారవనాన్త రామ్రు త సరః ప్రాంతేందు కాంతోప లో,
త్పల పర్యంక రమావినోది యగునాపన్నప్రసన్నుండు వి,
హ్వలనాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై అంటూ సాగుతుంది. దీని అర్ధం వైకుంఠపురంలో  ఉన్న శ్రీనివాసుడు గజేంద్రుని ఆర్తనాదం విని గజేంద్రుని రక్షించాలని అన్ని వదిలేసి ఉన్నపళంగా బయలు దేరడని అర్ధం. అంటే ఈ సినిమా తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగనుందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది సస్పెన్స్ గా మారింది. బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కీలకలో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  
 

More Related Stories