జబర్దస్త్ యాంకర్ అనసూయ పేరు వెనక ఉన్న కథ..anasuya
2020-04-12 17:07:32

అనసూయ.. ఈ రోజుల్లో అయితే అలాంటి పేరు మాత్రం ఎవరూ పెట్టుకోరు. మహాసాథ్వి పేరు అయినా కూడా ఈ తరం పిల్లలకు అలాంటి పేరు పెడతామంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు. కానీ యాంకర్ అనసూయ మాత్రం పెట్టుకుంది. ఈ పేరు వెనక చాలా పెద్ద కథ కూడా ఉంది. పేరు చూస్తే పాత చింతకాయ పచ్చడిలా ఉన్నా పాప మాత్రం హీరోయిన్ ఫిగర్ కు తక్కువ కాదు.. కొందరు హీరోయిన్ల కంటే కూడా అనసూయే బాగుంటుంది.. ఇందులో ఎలాంటి ప్రశంసలు కూడా లేవు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా ఇప్పటికీ అదే ఫిగర్ మెయింటేన్ చేయడం అంటే మాటలు కాదు కానీ చేస్తుంది ఈ భామ. జబర్దస్త్ యాంకర్ అనసూయ పేరు వెనక కూడా పెద్ద కథే ఉంది. అనసూయ ఏంటి అనసూయ.. పాష్‌గా ఉండే పేరు పెట్టుకోవచ్చు కదా.. కనీసం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతైనా మార్చుకోవచ్చు కదా అంటూ చాలా మంది ఈమెకు ఉచిత సలహాలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు ఈమె.

దీని వెనక ఉన్న కథ తెలిస్తే ఇలా మాట్లాడరు అంటుంది అనసూయ. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోవడంతో రోజూ అభిమానులతో ముచ్చటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. అనసూయ పేరు ఎందుకు పెట్టుకున్నారంటూ ఒకరు అడిగితే ఇది తన నాన్నమ్మ పేరని.. అందుకే ఈ పేరు పెట్టారని చెబుతుంది అనసూయ. నాన్నకు వాళ్లమ్మ అంటే చాలా యిష్టమని.. అందుకే తనకు ఈ పేరు పెట్టుకున్నాడని చెప్పింది ఈమె. వ్యక్తిగత విషయాల గురించి కూడా ఓపెన్ గానే చెప్పేస్తుంది అనసూయ. కానీ ఇదే అదునుగా ఎవరైనా ఎక్స్ ట్రాలు చేస్తూ తోకలు కత్తరిస్తుంది కూడా.

More Related Stories