రచ్చ రేపుతున్న బాలయ్యBalakrishna
2019-11-09 16:05:38

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రానికి `రూల‌ర్` అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన సంగతి తెలిసిందే. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా మారతాడు. అలా ఎందుకు మారతాడనేది ఈ సినిమా స్టోరీ. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు విడుదల చేసిన ఈ లుక్‌లో బాలయ్య చాలా యంగ్‌గా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయనున్నట్టు కూడా యూనిట్ ప్రకటించింది. ఈ లుక్‌తో సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు చిత్ర యూనిట్. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

More Related Stories