చిన్నారి గుండెకు ప్రాణం పోసిన యంగ్ హీరో



Sudheer Babu
2021-06-05 12:18:31

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. కేవ‌లం తాను రీల్ హీరో మాత్ర‌మే కాద‌ని రియ‌ల్ హీరో అని చాటుకున్నారు. సుధీర్ బాబు సోషల్ మీడియాలో ఓ కుంటుంబం త‌మ చిన్నారి కూతురు ఆప‌రేష‌న్ కోసం సాయం కోర‌డాన్ని చూసారు. సంసృతి అనే చిన్న‌రి గుండె సంభందిత వ్యాధితో బాధ‌ప‌డుతోంది. దాంతో కుటుంబ సంభ్యులు డ‌బ్బులు లేవ‌ని ఆప‌రేష‌న్ కు రూ.3ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతాయ‌ని కోరారు. కాగా ఆ పోస్టును షేర్ చేసిన సుధీర్ బాబు తాను ల‌క్ష రూపాయలు ఇస్తున్నా అని ఇంకా  ఎవ‌రైనా చిన్నారి కోసం సాయం చేయాల‌ని కోరాడు. కాగా ఆప‌రేష‌న్ కు స‌రిప‌డా డ‌బ్బులు వ‌చ్చేశాయి. అలా వ‌చ్చిన డ‌బ్బును సుధీర్ బాబు పాప త‌ల్లి తండ్రకు అప్ప‌గించారు. ఆప‌రేష‌న్ కూడా పూర్తి కాగా ప్ర‌స్తుతం పాప పూర్తి ఆరోగ్యంగా ఉంది. 

అంతే కాకుండా సుధీర్ బాబు ఆ పాప చ‌దువుల కోసం కూడా కొంత డ‌బ్బును బ్యాంక్ లో డిపాజిట్ చేసారు. అలా ఓ చిన్నారి ప్రాణాన్ని ర‌క్షించి సుధీర్ బాబు త‌న గొప్ప‌మ‌నుసు చాటుకోవ‌డ‌మే కాకుండా. ఆయ‌న అభిమానుల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం సుధీర్ బాబు పలు క్రేజీ ప్రాజ‌క్టుల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం సుధీర్ బాబు హీరోగా శ్రీదేవీ సోడా సెంట‌ర్ సినిమా తెర‌కెక్కుతోంది. ఇటీవ‌ల ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మ‌రో సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ఉప్పెన భామ కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. 
 

More Related Stories