బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షోనా..సుజాత షాకింగ్ కామెంట్స్Sujatha
2020-10-15 13:12:18

బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఇక తాజాగా ఐదవవారం ఎలిమినేషన్ లో భాగంగా జోర్ధార్ సుజాత ఎలిమినేట్ అయింది. హౌస్ నుండి భయటకు వచ్చిన సుజాత ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నలుగువారాలు ఇంట్లో ఉన్న సుజాత భయటకు రావడానికి పెద్ద కారణాలు లేవు. ఆమె భయటకు రావడానికి కారణం వెక్కిలి నవ్వు, నాగార్జున ను బిట్టు అని పిలవడమే అని తెలిసిందే. సుజాత రీజన్ లేకుండా నవ్వడం, నాగార్జునను బిట్టు అని పిలవడం ఇరిటేషన్ పుట్టిస్తుందని నెటిజన్లు మండిపడ్డారు. దాంతో ఆమె ఎలిమినేషన్ లోకి వస్తే వెంటనే పంపిస్తామని అన్నారు. ఈ క్రమంలో సుజాత ఎలిమినేషన్ లోకి రావడంతో ఓట్లు తక్కువ పడి ఆమె ఎలిమినేట్ అయ్యారు. 

కాగా నాగార్జున ను బిట్టు అని పిలవడంపై సుజాత తాజాగా క్లారిటీ ఇచ్చింది. తాను నాగార్జున ను బిట్టు అని పివడానికి కారణం బిగ్ బాస్ టీం అని తెలిపింది. షో నిర్వాహకులు మనం సినిమాలో నాగార్జున పేరు బిట్టు అని అలా పిలవడం నీకు ఇష్టమేనా అని అడిగారని వెల్లడించింది. వాళ్ళ సలహా మేరకే అలా పిలిచానని చెప్పింది. అంతే కాకుండా నాగార్జున ఫ్యాన్స్ కు సుజాత క్షమాపణలు చెప్పింది. తాను నాగార్జున ను బిట్టు అని పిలవడం బిగ్ బాస్ పని కాకపోతే తనను కన్ఫెక్షన్ రూమ్ కు పిలిచి బిగ్ బాస్ చెప్పేవాడని పేర్కొంది. ఇక సుజాత చెప్పిన విషయంతో బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ అని ప్రేక్షకులకు అనుమానాలు వస్తున్నాయి.
 

More Related Stories