అల్లు అర్జున్ సినిమాలో అడవి చుక్క పాత్రలో అనసూయ.. Sukumar
2019-09-26 15:01:01

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి జబర్దస్త్ ప్రోగ్రాంతో హోస్ట్ గా మారి ఇప్పుడు నటిగా బిజీ అవుతుంది యాంకర్ అనసూయ. రోజు రోజుకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా అదిరిపోయే గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది అను. ఇప్పుడు ఈ భామ కోసం దర్శక నిర్మాతలు కూడా ప్రత్యేకంగా పాత్రలు సృష్టిస్తున్నారు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అదరకొట్టిన అనసూయ ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూనే ఉంది. ఈ మధ్యే విడుదలైన ఎఫ్2 సినిమాలో కూడా అతిధి పాత్రలో నటించింది. ఇక యాత్ర సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించింది అనసూయ. ఇక ఇప్పుడు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేస్తున్న మీకు మాత్రమే చెప్తా సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. కింగ్ ఆఫ్ హిల్స్ బ్యానర్పై ఈ చిత్రం వస్తుంది. ఈ సినిమాతో పాటు చిరంజీవి, కొరటాల శివ సినిమాలోనూ అనసూయ ముఖ్య పాత్రలో నటించబోతుంది. దానికితోడు ఇప్పుడు బన్నీ హీరోగా సుకుమార్ తెరకెక్కించబోయే సినిమాలో అడవిలో ఉండే పాత్రలో నటించబోతుంది ఈ భామ. శేషాచలం కొండల ప్రాంతంలో ఈ కథ జరగనుంది. అక్కడే ఉండే ఆఫీసర్ పాత్రలో బన్నీ నటిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మొత్తానికి వరస సినిమాలతో రప్ఫాడిస్తుంది అనసూయ. 

More Related Stories