ఆ దర్శకులను గుడ్డిగా ఫాలో అవుతున్న సుకుమార్.. Sukumar
2019-11-01 10:22:23

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ల రెమ్యునరేషన్ కూడా స్టార్ హీరోల స్థాయిలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే రాజమౌళి, కొరటాల శివ లాంటి దర్శకుల రేంజ్ స్టార్స్ ను కూడా మించిపోయింది. వాళ్లతో ప్రస్తుతం సినిమాలు చేయాలంటే 20 కోట్ల వరకు ఇచ్చుకోవాల్సిందే. అంత ఇస్తే నిర్మాతలకు మిగిలేది ఏం ఉండదు. అందుకే వాళ్లు కూడా సినిమాలో షేర్స్ తీసుకుంటున్నారు.. అంటే వాట అన్నమాట. ఇప్పుడు ఇదే దారిలో సుకుమార్ కూడా చేరుతున్నాడని తెలుస్తుంది. తన సినిమా ఏదో తను చేసి.. రెమ్యునరేషన్ తీసుకుని వెళ్లిపోయే ఈ దర్శకుడు ఇప్పుడు మాత్రం కొత్తగా షేర్ ప్రాసెస్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా కోసం మైత్రీ మూవీస్ సంస్థకు కొన్ని డిమాండ్స్ పెట్టాడని తెలుస్తుంది. ఈ సినిమా బిజినెస్ లో షేర్ తీసుకోవడమే కాకుండా ఈ సినిమా నిర్మాణ సమయంలో నెలకు 10 లక్షలు ఖర్చులు నిమిత్తం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజమౌళితో పాటు కొరటాల కూడా ఇదే చేస్తాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో రెమ్యునరేషన్ కాకుండా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కు నెలకు 10 లక్షల చొప్పున ఇస్తున్నాడు నిర్మాత దానయ్య. అదే కొరటాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఇదే సుకుమార్ కూడా చేస్తున్నాడు. అందుకే ఈ చిత్ర నిర్మాణాన్ని సుకుమార్ చాలా వేగంగా పూర్తి చేయాలన్న కండిషన్ తో బన్నీ ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. నవంబర్ లో మొదలుపెట్టి సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అలా చేస్తే రెమ్యునరేషన్ కాకుండా సుకుమార్ కు మరో 60 లక్షలు అదనంగా ఇచ్చినట్లు అవుతుంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీ సంగీతం అందిస్తున్నాడు. 

More Related Stories