పుష్ప రిలీజ్ డేట్ పై సుకుమార్ అసంతృప్తి..కారణం ఇదే



Sukumar
2021-02-02 18:20:47

అల వైకుంఠపురం లాంటి సూపర్ హిట్ తరవాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా "పుష్ప". ఈ సినిమా షూటింగ్ ను సుకుమార్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఖమ్మం జిల్లాలోని మోతుగూడెంలో జరుగుతుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న కారణంగా ఎక్కువ శాతం షూటింగ్ ను అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. దాంతో బన్నీ లుక్ ఉరమాస్ గా డిఫరెంట్ గా కనిపిస్తోంది. రష్మిక మందన బన్నీకి హీరోయిన్ గా నటిస్తోంది.  ఆర్య, ఆర్య-2 లాంటి హిట్స్ ఇచ్చిన సుకుమార్ తో తెరకెక్కుతున్న పుష్ప పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. 

ఈ సినిమాతో సుక్కు బన్నీ కాంబినేషన్ హాట్రిక్ కొట్టబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించేసారు. అయితే ఇక్కడే సుకుమార్ అప్సెట్ అయ్యినట్టు తెలుస్తోంది. ఇంకా సినిమా షూటింగ్ కు 170 రోజుల సమయం ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించడంపై సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారట. అయితే అల్లు అర్జున్ నిర్మాతలను తొందర పెట్టడంతోనే వారు ఆగస్టు 13న రిలీజ్ చేస్తునట్టు ప్రకటించారని టాక్ వినిపిస్తోంది. కాగా బన్నీ ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసుకుని కొరటాల తో సినిమాను మొదలు పెట్టేందుకే నిర్మాతలను తొందర పెట్టారట. దాంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోతే విడుదల తేదీని కూడా పోస్ట్ ఫోన్ చేసే అవకాశాలు ఉన్నాయి.  

More Related Stories