సుకుమార్ వెబ్ సిరీస్...చరణ్ హ్యాండ్ కూడా  Sukumar Ram Charan
2020-05-03 00:13:45

ఈ మధ్య కాలంలో ఒక టాక్ బాగా వినిపిస్తోంది. అదేంటంటే భవిషత్తులో సినిమాలు మాయం అవ్వచ్చని ? సినిమాల్ని వెబ్ సిరీస్ లు, ఇండిపెండెంట్ సినిమాలు రీప్లేస్ చేయచ్చనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనకు తగ్గట్టే చాలా మంది స్టార్స్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాటిలో భాగం అవుతున్నారు. అయితే పెద్ద పెద్ద పండగలకు కొత్త సినిమాలు వేసుకుని వాటి ద్వారా టీఆర్పీలు పెంచుకునేవి టీవీ ఛానల్స్. కానీ ఈమద్య కాలంలో వెబ్‌ సిరీస్‌ లు లెక్కకు మించి నిర్మితం అవుతున్నాయి. ఒక్క సిరీస్ సక్సెస్‌ కావడం ఆలస్యం ఎంతనే వాటికి సీక్వెల్స్‌ అంటూ వరుసగా సిరీస్ లు వస్తున్నాయి. మొన్నటి వరకు ఇతర దేశాలకే పరిమితం అయిన వెబ్‌ సిరీస్‌ లు గత కొంత కాలంగా ఇండియాలో కూడా విస్తరిస్తున్నాయి. 

బ్‌ సిరీస్‌ లను కూడా సినిమాల స్థాయిలో సినిమా నటీనటులను, టెక్నీషియన్స్ ని పెట్టి మరీ తీస్తున్నారు. నిజానికి సినిమాలకు అయితే కొన్ని పరిమితులు, సెన్సార్‌ లాంటి కండీషన్స్‌ ఉంటాయి. వెబ్‌ సిరీస్‌ లకు అలాంటివి ఏమీ లేని కారణంగా చాలా మంది వెబ్‌ సిరీస్‌ లపై ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ కే పరిమితం అయిన ఈ సిరీస్ నెమ్మదిగా తెలుగులో కూడా విస్తరిస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే క్రిష్ కొన్ని వెబ్ సిరీస్ తీయగా ఇప్పుడు ఏకంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సిరీస్ ల మీద ఇంటరెస్ట్ చూపిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయన ఓ వెబ్ సిరీస్‌ ను ప్లాన్ చేస్తున్నారని అది కూడా పుష్పకు రిలేటెడ్‌గా ఉంటుందని అంటున్నారు. 

ఎందుకంటే ఈ సినిమా కథను ప్రిపేర్ చేసే క్రమంలో సుకుమార్ టీం ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి చాలా రీసెర్చ్ చేసిందట. దీంతో వారు అనుకున్నదాని కంటే ఎక్కువ సమాచారమే దొరికిందట. అందులోంచి సినిమాకు తీసుకున్న కంటెంట్ చాలా చిన్నది కాగా ఆ  మిగతా సమాచారంతో వెబ్ సిరీస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనికి రామ్ చరణ్ సపోర్ట్ కూడా ఉందని అంటున్నారు. ఎందుకంటే అమేజాన్ ప్రైం సంస్థలో చరణ్ బంధువు ఒకరు కీలక పొజిషన్ లో ఉన్నాడట. ఆయన సపోర్ట్ తోనే ఆమెజాన్ తో సుకుమార్ బడ్జెట్ డిస్కషన్స్ కూడా పూర్తీ చేశారని అంటున్నారు. చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణ భాగస్వామిగా ఉండవచ్చని అంటున్నారు. అయితే దీనికి సుకుమార్ దర్శకుడిగా ఉంటారా ? లేక తన అసిస్టెంట్ ని ఎవరిని అయినా పెట్టి ప్లాన్ చేస్తారా ? అనేది తెలియాల్సి ఉంది.  

More Related Stories