సుకుమార్ - బన్నీ ఒక గడ్డం సెంటిమెంట్allu
2020-03-15 15:42:18

తెలుగు ఇండస్ట్రీలో సెంటిమెంట్ ను నమ్మని వ్యక్తులు చాలా అరుదు. దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. మిగతా వారి సంగతి ఏమో కానీ ముఖ్యంగా హీరోలు, దర్శకులకి చెందిన ఈ సెంటిమెంట్ లు మాత్రం వార్తల్లోకి వస్తూ ఉంటాయి. రాఘవేంద్ర రావు సినిమా షూటింగ్ మొదలయ్యిందంటే గెడ్డం తీయరు, కోడి రామకృష్ణ తలకు బ్యాండ్, త్రివిక్రమ్ కి అ సెంటిమెంట్. అనిల్ రావిపూడికి ఏదో ఒక విచిత్రమైన సౌండింగ్. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్ అన్న మాట. ఇప్పుడు ఈ సెంటిమెంట్ ని మరో దర్శకుడు ఫాలో అవుతున్నాడు. ఆయనే సుకుమార్. దర్శకుడు సుకుమార్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుంది. ఇందులో బన్నీ గుబురు గెడ్డెంతో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడన్న ప్రచారం మొదటి నుండీ జరుగుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనున్న ఈ కథలో స్మగ్లర్‌లకి సహకరించే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ పాత్రలో రింగుల జుట్టుతో.. గుబురు గెడ్డంతో ఆయన లుక్ కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఈ లుక్ లో బన్నీ గడ్డం కోన్ షేప్ లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారట. ఈ రకమైన గడ్డంతోనే నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్, రంగస్థలంలో చరణ్ కనిపించి హిట్స్ కొట్టారు. అందుకే అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ సినిమాలో కూడా కోన్ గెడ్డంతో బన్నీ కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటించనుంది. 'రంగస్థలం'వంటి హిట్ ఇచ్చిన సుకుమార్ ఆ తరువాత మరే సినిమా చేయలేదు. అందుకే ఈ సినిమాని ఎలా అయినా హిట్ చేసుకోవాలనే కసితో ఉన్నాడు.  

 

More Related Stories