ఇంటి పని చేసిన సుక్కూ..మార్కులేసిన బెటర్ ఆఫ్  Sukumar
2020-04-22 13:27:06

కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లన్నీ బంద్‌ అయిపోయాయి. ఇండస్ట్రీ మొత్తం ఇంటికే పరిమితమైపోయింది. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు.. ఇలా అందరు ఇళ్లలో కుటుంబసభ్యులతో హ్యాపీగా గడుపుతున్నారు. ఇంటిపని, వంటపనులతో సందడి చేస్తున్నారు. తాము ఇళ్లలో చేస్తున్న పనులను వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీంతో వారి ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు. ఇక ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ‘బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ ని దర్శకుడు సుకుమార్ స్వీకరించాడు. ఆయనకీ దర్శక ధీరుడు రాజమౌళి ఈ ఛాలెంజ్ ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే అందులో సుకుమార్ చేసిన ఇంటి పనికి ఆయన సతీమణి తబిత మార్కులేయడం విశేషం. ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, శివ కొరటాల, నిర్మాత దిల్‌ రాజు పేర్లను నామినేట్ చేశారు సుకుమార్. చూద్దాం ఈ ఛాలెంజ్ ల పరంపర ఎందాకా వెళుతుందో ? 

More Related Stories