కార్తీ సుల్తాన్‌ టీజర్‌.. కృష్ణుడు కౌరవుల వైపు ఉండుంటే Sulthan
2021-02-01 19:39:58

కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సుల్తాన్''  చిత్రం టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. యాక్షన్‌, లవ్‌, సెంటిమెంట్‌, డ్రామా ఇలా అన్ని అంశాలను రంగరించినట్లుగా ఉన్న ఈ టీజర్‌ అభిమానులను ఆకర్షిస్తోంది. "మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నిల్చున్నాడు, అదే కౌరవుల వైపు ఉండుంటే? అదే మహాభారతాన్ని యుద్ధం లేకుండా ఊహించుకోండి" అని చరిత్రను తిరగరాసి చెప్తున్నాడు హీరో కార్తీ. షూటింగ్‌ పూర్తైన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి భాగ్య రాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహించాడు. ఇందులో కార్తీ సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించింది. టాలీవుడ్ శాండిల్ వుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కు ఇది తమిళ డెబ్యూ మూవీ. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నెపోలియన్ - లాల్ - యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. 

More Related Stories