లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ టాప్ యాంకర్స్ అంతా కలిసి.. Sumakka
2020-04-18 18:33:17

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా అందరి ఇళ్లకు పరిమితమైపోయారు. మరో 20 రోజుల పరిస్థితులు ఇలాగే ఉండటంతో ఎంటర్టైన్మెంట్ కూడా కరువైపోయింది. యాంకర్స్ అందరూ పని లేకుండా పోయారు. ప్రస్తుతం అందరూ ఇళ్లలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇన్ని రోజులు బిజీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు దొరికిన సమయాన్ని పూర్తిగా కుటుంబంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ టాప్ యాంకర్స్ అంతా కలిసి ప్రేక్షకుల కోసం ఒక వినూత్నమైన కార్యక్రమం మొదలు పెట్టారు. ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ అందించడమే లక్ష్యంగా యాంకర్ సుమ ఈ బాధ్యత తీసుకుంది. తనతో పాటు మరో నలుగురిని ఈ కార్యక్రమంలో చేర్చుకుంది సుమ.

సుమక్క సూపర్ 4 పేరుతో ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇందులో యాంకర్ సుమతో పాటు జబర్దస్త్ యాంకర్స్ అనసూయ, రష్మి కూడా ఉన్నారు. ఇక మేల్ యాంకర్స్ ప్రదీప్, రవి కూడా సుమక్క కార్యక్రమంలో జాయిన్ అయిపోయారు. అందరూ కలిసి అదిరిపోయే అల్లరి చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్లంతా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఈ ప్రోగ్రాం చేశారు. ఈ ఎంటర్ టైన్మెంట్ మీ కోసమే అంటూ సుమన్ తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది. 

More Related Stories