ఫిబ్రవరి 13న సుమంత్ అశ్విన్ పెళ్లి 



Sumanth Ashwin
2021-02-03 17:39:50

ప్రముఖ నిర్మాత, ఎంఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎం.ఎస్. రాజు తనయుడు అయిన సుమంత్ అశ్విన్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.  ఫిబ్రవరి 13న సుమంత్ అశ్విన్ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. దీపిక అనే అమ్మాయి మెడలో తాళి కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. హైదరాబాద్‌లోనే అతి కొద్ది మంది సమీప బంధువులు, అత్యంత సన్నిహిత మిత్రుల మధ్య సుమంత్ అశ్విన్ పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. ఎం.ఎస్ రాజుకు ఒక నిర్మాతగా సినీ పరిశ్రమలో అనేక మంది ప్రముఖులు, నటీనటులు, టెక్నీషియన్స్‌తో పరిచయాలు ఉన్నప్పటికీ... కొవిడ్-19 గైడ్ లైన్స్ కారణంగా అతి కొద్ది మంది మధ్యే ఈ పెళ్లిని జరిపించాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం. 

More Related Stories