నిర్మాతగా యంగ్ హీరో..తండ్రితో ఫస్ట్ సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ నిర్మాత అవతారం ఎత్తబోతున్నారు. సుమంత్ అశ్విన్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. వాటిలో తూనిగ తూనిగ, లవర్స్, కేరింత సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే ఈ యంగ్ హీరో ఇప్పుడు నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నారట. ఇటీవలే సుమంత్ అశ్విన్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారయ్యారు. కరోనా వేళ ఈ పెళ్లి జరగటంతో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది. ఇక పెళ్లి తరవాత సుమంత్ అశ్విన్ కొద్దిరోజులు నటనకు బ్రేక్ ఇచ్చి సినిమాలను నిర్మించబోతున్నారు.
వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించబోతున్నారు. ఇక మొదటి సినిమాను తన తండ్రితోనే తీయడం విశేషం. ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్ తండ్రి ఎం ఎస్ రాజు దర్శకత్వం వహిస్తారట. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి 7డేస్..7నైట్స్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఎన్నో సినిమాలను నిర్మించిన ఎంఎస్ రాజు ఇటీవలే డర్టీ హరి పేరుతో ఓ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమా మంచి విజయం సాధించిన జోష్ లో ఇప్పుడు కొడుకు బ్యానర్ లోనే ఎంఎస్ రాజు సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెలుబడనున్నాయి.