సునీల్ కెరీర్ చక్కదిద్దడానికి త్రివిక్రమ్ ఒక్కడే దిక్కా..sunil
2019-11-28 17:13:06

ఆప్షన్ లేదు మీకు అర్థమైంది నాకు.. ప్రస్తుతం సునీల్ కి డైలాగ్ బాగా సూట్ అవుతుంది. ఈయనకు మరో ఆప్షన్ లేదు ఇప్పుడు. హీరోగా నటించిన చాలా సినిమాలు ఇప్పటికే పరాజయం పాలయ్యాయి.. దాంతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు సునీల్. అయితే రీ ఎంట్రీలో ఇప్పటివరకు త‌న మార్క్ చూపించ‌లేదు ఈ క‌మెడియ‌న్. ఏ సినిమాలోనూ క‌డుపులు చెక్క‌ల‌య్యేలా న‌వ్వించ‌లేదు. అరవింద సమేత, చిత్రలహరి సినిమాల్లో మంచి క్యారెక్టర్ చేసినా కూడా అది కామెడీ రోల్ కాదు. దాంతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు పనికొచ్చే మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు సునీల్. ఇలాంటి సమయంలో మళ్లీ త్రివిక్రమ్ నే న‌మ్ముకుంటున్నాడు ఈయన. ఈ మధ్యే చాణక్యలో 10 నిమిషాలు కనిపించే పాత్ర కూడా చేసాడు సునీల్. 

త్రివిక్రమ్ కాంబినేషన్లో బ‌న్నీ చేస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నాడు సునీల్. ఆ మధ్య తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన సునీల్ అక్కడ ఈ విషయం స్పష్టం చేశాడు. త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నానని.. పూర్తి స్థాయి కామెడీ పాత్ర ఇందులో చేయ‌బోతున్నానంటున్నాడు సునీల్. కచ్చితంగా ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశిస్తున్నాడు ఈ భీమవరం బుల్లోడు. మొత్తానికి ఎటు తిరిగినా ఏం చేసినా చివరికి మళ్ళీ త్రివిక్రమ్ దగ్గరే వచ్చి ఆగాడు సునీల్. ఒకప్పుడు తన కెరియర్ కు మంచి మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించిన స్నేహితుడే ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో తనను నిలబడతాడని ఆశిస్తున్నాడు సునీల్. మరి ఈ నమ్మకాన్ని త్రివిక్ర‌మ్ ఎంతవరకు నిజం చేస్తాడనేది చూడాలి.

More Related Stories