విజయ్ దేవరకొండ సినిమాలో బాలీవుడ్ హీరో కీలకపాత్ర..Sunil Shetty
2020-10-19 23:14:24

వరుస ప్లాపులు వస్తున్న కూడా విజయ్ దేవరకొండ దూకుడు అసలు తగ్గడం లేదు. ఈయన ప్రస్తుతం పూరి జగన్నాథ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. దానికితోడు మాఫియా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు విజయ్ దేవరకొండ. ఇదిలా ఉంటే ఫైటర్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే విజయ్ కి జోడీగా నటిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దానికితోడు ఫ్యాన్ ఇండియా స్థాయిలో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. పూరి జగన్నాథ్, చార్మితో కలిసి బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. హిందీలో ఈయనే విడుదల చేస్తున్నారు కూడా. గతంలో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా రీమేక్ రైట్స్ కూడా కరణ్ జోహార్ తీసుకొన్నాడు. 

ఇక ఈ సినిమాలో ఇప్పుడు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలకపాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే సౌత్ సినిమాలపై సునీల్ ఫోకస్ చేశాడు. కన్నడ, తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు సునీల్ శెట్టి. తెలుగులో మంచు విష్ణు హీరోగా వస్తున్న మోసగాళ్లు సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ మాఫియా డాన్ పాత్రలో సునీల్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ ఎపిసోడ్ కోసం పూరి జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సునీల్ శెట్టి ఉండే 15 నిమిషాలు సినిమాలో అత్యంత కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇదే ఏడాది సినిమా షూటింగ్ పూర్తి చేసి 2021 ఫిబ్రవరిలో సినిమాను విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు పూరి. విజయ్ దేవరకొండ మార్కెట్ ను మించి భారీగానే ఖర్చు పెడుతున్నాడు పూరి జగన్నాథ్. కథపై నమ్మకంతో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
 

More Related Stories