అల్లు అర్జున్ పుష్ప షూట్ లో బిజీగా సునీల్ 



allu arjun
2020-12-23 15:43:22

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడు సునీల్‌ని ఎంపిక చేశారు. ప్రస్తుతం సునీల్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం మొదట పలువురి పేర్లు వినిపించాయి. ఇందులో సునీల్ పేరు కూడా ఉంది. మరి ఆయన్ని ఏ పాత్ర కోసం ఎంపిక చేశారనేది తెలియాల్సి ఉంది.   ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సునీల్‌పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘డిస్కో రాజా’లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించారు. అలాగే కలర్ ఫోటో లో కూడా తన విలనిజాన్ని చూపించారు. మరి పుష్ప లో సునీల్ ఏ పాత్ర చేస్తున్నాడు అనేది తెలియాలంటే చిత్ర విడుదల వరకు వేచి చూడాల్సిందే.

More Related Stories