మరి ఆ రోజుల్లో మహేష్ బాబు ఎలా ఉండేవాడంటే.. Mahesh babu
2019-10-01 16:03:34

మరి ఆ రోజుల్లో.. ఈ డైలాగ్ వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది బాలయ్య. కానీ ఇక్కడ ఫోటో చూసిన తర్వాత మాత్రం మనకు సూపర్ స్టార్ మహేష్ బాబు గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే ఈయన చిన్నప్పటి ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. అప్పట్లో ఆయన దిగిన ఓ ఫోటో ఇప్పుడు బయటికి వచ్చింది. మహేష్ బాబు కదా.. అందుకే ఫోటో కూడా వైరల్ అవుతుంది. తన బంధువులలో ఒకరితో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు తెగ తిరిగేస్తుంది. అభిమానులకు కూడా ఈ ఫోటో బాగా నచ్చేసింది. క్యూట్ గా చూస్తున్న మహేష్ ను చూసి అంతా ఫిదాఅయిపోతున్నారు. ఈ ఫోటో దాదాపు 40 ఏళ్ల కిందిది. 1975లో పుట్టాడు సూపర్ స్టార్. ఆ తర్వాత నాలుగేళ్లకే అంటే 1979లో నీడ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. బాలనటుడిగా దాదాపు 15 సినిమాలు చేసాడు కూడా. ఆ సమయంలోనే డెనిమ్ జాకెట్ ధరించి కెమెరా వైపు క్యూట్ గా చూస్తున్నాడు సూపర్ స్టార్. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. అప్పటి ఫోటో సంగతి పక్కనబెడితే ప్రస్తుతం ఈయన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. 

More Related Stories