సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా ఆ హీరోతో నేనా ?  Surender Reddy
2019-10-02 12:04:55

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా ? అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా తరువాత సురేందర్‌ రెడ్డి చేయబోయే సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర అప్ డేట్ హాల్ చల్ చేస్తోంది. 

నిజానికి సురేందర్ రెడ్డి తర్వాతి సినిమా ఏంట‌నే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. అయితే సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సురేంద‌ర్ రెడ్డి త‌న త‌దుప‌రి సినిమాను పెద్ద హీరోతో కాకుండా యంగ్ హీరో అయిన నితిన్‌తో చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. అయితే నిజానికి ఇప్ప‌టికే నితిన్ చాలా ప్రాజెక్టుల‌ను లైన్‌లో పెట్టుకున్నాడు. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా మరో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. 

మరి సురేందర్ రెడ్డి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాటి పరిస్థితి ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే అన్నీ వీరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కడం పెద్ద సమస్యేమీ కాదని తెలుస్తోంది. ఎందుకంటే వీరు రేసు గుర్రం కంటే ముందే సినిమా చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని సమస్యల వలన ఆ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంద‌ని టాక్‌. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

More Related Stories