సురేందర్ రెడ్డిలో అంత దమ్ముందా.. రాజమౌళిని మరిపిస్తాడా..syeraa
2019-09-20 06:43:22

తెలుగు ఇండస్ట్రీలో విజువల్ వండర్స్ తెరకెక్కించాలంటే మరో ఆలోచన లేకుండా మదిలో మెదిలే దర్శకుడు రాజమౌళి. ఆయన తర్వాతే ఎవరైనా.. మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీలో అనేవాళ్లు కానీ ఇప్పుడు బాహుబలి చూసిన తర్వాత మొత్తం ఇండియాలో రాజమౌళిని మించిన దర్శకుడు మరొకరు లేరంటున్నారు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. మరో 15 రోజుల్లోనే సినిమా విడుదల కానుంది. ఇది కూడా పూర్తిగా పీరియాడికల్ మూవీ కావడం.. అందులోనూ భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో కచ్చితంగా ఇది రాజమౌళి స్థాయి సినిమా అవుతుందని నమ్మకంగా ఉన్నారు అభిమానులు. ఇప్పటి వరకు విజువల్ సినిమాలంటే రాజమౌళి గుర్తుకొచ్చేవాడు. కానీ ఇప్పుడు తన పేరు గుర్తుకొచ్చేలా సైరాను తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. యుద్ధ సన్నివేశాలు కానీ.. ట్రైలర్ కట్ కానీ చూసిన తర్వాత నిజంగానే ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి చేసాడా అనిపించక మానదు. అంత స్టైలిష్ మేకోవర్ తో పిచ్చెక్కించాడు ఈక్ష్న. ఇప్పటి వరకు తెలుగులో రాజమౌళి సృష్టించిన సంచలనాలు ఎన్నో ఉన్నాయి.

ఇప్పుడు సురేందర్ రెడ్డి ఈ స్థానంలో ఉండాలనుకుంటున్నాడు. అందులో తొలి అడుగు సైరా నరసింహారెడ్డి. రాజమౌళి చేసిన ప్రతీ సినిమా విజయం సాధించింది. కానీ ఇతర దర్శకులు ఇలాంటి విజువల్ వండర్స్ చేసినపుడు దెబ్బతిన్నారు. దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక చతికిలపడ్డారు. మగధీర తర్వాత వచ్చిన శక్తి, బద్రీనాథ్ లాంటి సినిమాలు బోల్తా కొట్టాయి. బాహుబలి తర్వాత అలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఇప్పుడు సైరాతో సురేందర్ రెడ్డి చేస్తున్నాడు. ఇది కానీ హిట్ అయిందంటే సురేందర్ రెడ్డి మరో రాజమౌళి కావడం ఖాయం. పైగా ఈ చిత్రానికి 64 ఏళ్ల చిరంజీవి ఎనర్జీ స్పెషల్ ఎట్రాక్షన్. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి ఇలా ఎంతోమంది స్టార్స్ ఉన్నారు. అందరి ప్రోత్సాహంతో సురేందర్ రెడ్డి సైరాను చరిత్రలో మిగిలిపోయేలా తెరకెక్కించే ఉంటాడని నమ్ముతున్నారు అభిమానులు. మరి చూడాలిక.. ఈ చిత్రంతో నిజంగానే రాజమౌళిని ఈ దర్శకుడు మరిపిస్తాడో లేదో..?

More Related Stories